Header Banner

దేశంలో భారీగా పెరుగుతున్న బ్లడ్ క్యాన్సర్ కేసులు! ఈ లక్షణం ఉంటే చాలా?

  Sun Feb 23, 2025 08:29        Health

మానవ శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ రావచ్చు. దాదాపు 200 రకాల క్యాన్సర్లు ఉంటాయట. అయితే మనిషి రక్తం, ఎముక మజ్జను ప్రభావితం చేసే క్యాన్సర్‌ను అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అంటారు. కొన్నాళ్లుగా ఇండియాలో ఈ రకం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బ్లాస్ట్స్ (Blasts) అని పిలిచే అసాధారణ కణాలు వేగంగా పెరిగినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ బ్లాస్ట్స్ అనేవి సాధారణ రక్త కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఒక రకమైన ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్. 

 

పదేళ్ల క్రితం, ఇండియాలో AML కేసులు 40 సంవత్సరాల వారికి, మధ్య వయస్కుల్లో ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు చిన్న వయసులో కూడా దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా వ్యాధి ముదిరిన తర్వాతే చాలామంది దీన్ని గుర్తిస్తున్నారు. దీంతో ట్రీట్‌మెంట్ ఆలస్యం అవుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాధారణంగా క్యాన్సర్‌కు కీమోథెరపీతో చెక్ పెట్టవచ్చు. అయితే అక్యూట్ మైలోయిడ్ లుకేమియా బాధితులకు కీమోథెరపీ సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మల్టీడ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో మరణాల రేటు పెరుగుతోంది. 

 

AML కేసులను గుర్తించే పర్ఫెక్ట్ మెకానిజం ఇండియాలో లేదు. దీంతో వ్యాధిని త్వరగా గుర్తించలేకపోతున్నారు. అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. దీంతో ఇది సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్‌గా మారుతోంది. అలాగే బాధితులను ఎవరు ట్రీట్ చేయాలనే రిఫరల్ సిస్టమ్‌పై కూడా హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌కు అవగాహన ఉండట్లేదు. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మన దేశంలో అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML)ను ముందస్తుగా గుర్తించే డయాగ్నస్టిక్ ఫెసిలిటీస్ సరిగా లేవు. దీనికి సంబంధించిన హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోవడంతో వ్యాధి నిర్ధారణ, ట్రీట్‌మెంట్‌కు సరైన ఆప్షన్స్ లేవు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో AMLను గుర్తించి, ట్రీట్‌మెంట్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఇది మరణాల రేటును పెంచుతోంది. 

 

కార్పొరేట్ హాస్పిటల్స్‌లో AMLకు ట్రీట్‌మెంట్ అందిచడానికి భారీగా ఖర్చు అవుతుంది. చాలామంది రోగుల కుటుంబాలకు ఇది పెద్ద భారం అవుతుంది. అలాగే ప్రభుత్వ పథకాల నుంచి ఈ ట్రీట్‌మెంట్‌కు ఆర్థిక సహాయం పొందడం ఆలస్యం అవుతోంది. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిపై అవగాహన పెరగాలి. డయాగ్నస్టిక్‌ సెంటర్స్, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పెంచాలి. AML కేసులు కచ్చితంగా నమోదు చేసి, ఎలాంటి ట్రీట్‌మెంట్స్‌తో ఇండియాలోని బాధితులకు త్వరగా ఉపశమనం కలుగుతుందో గుర్తించాలి. 

 

AML కేర్‌ కోసం డెడికేటెడ్ హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్‌ను క్రియేట్ చేయాలి, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలి. AML ట్రీట్‌మెంట్, వ్యాధి కారకాలు, నివారణ మార్గాలకు సంబంధించిన గైడ్‌లైన్స్ డెవలప్ చేయాలి. హాస్పిటల్ బెడ్స్, హెల్త్‌కేర్ వర్కర్లు, ల్యాబ్స్ వంటి వనరులకు యాక్సెస్‌ను పెంచాలి. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్ పెంచాలి. జనరిక్ క్యాన్సర్, యాంటీమైక్రోబయల్ డ్రగ్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, వీటిని సాధారణ ప్రజలకు ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలి. కొత్త మెడిసిన్, ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ కోసం క్లినికల్ ట్రయల్స్‌ పెంచాలి. సామాన్యులకు AML లాంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కు ట్రీట్‌మెంట్ ఇప్పించేలా పాలసీ డిసీజన్స్ మార్చాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #Cancer #BloodCancer